News March 13, 2025

రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

image

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

Similar News

News November 28, 2025

MDK: అన్నా నేను తాగుత లేనన్నా..!

image

ఎన్నికలు రావడంతో ఉమ్మడి MDKలో మద్యంప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్‌లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్‌లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

మిరపలో మొవ్వుకుళ్లు తెగులుకు కారణమయ్యే తామర పురుగు నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ml లేదా స్పైనోశాడ్ 0.25ml లేదా అసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3mlలలో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి. గట్లమీద కలుపు మొక్కలు వైరస్‌లకు స్థావరాలు. వీటిని పీకి నాశనం చేయాలి. వైరస్ సోకిన మిరప మొక్కలను కాల్చివేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న, మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి.