News July 16, 2024
రేపు స్కూళ్లకు సెలవు
మొహర్రం సందర్భంగా రేపు ఏపీ, తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉండనుంది. స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. జులై 17న హిందువుల తొలి ఏకాదశి, ముస్లింల మొహర్రం సందర్భంగా సెలవు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది మొదటి నెల. ఈ మాసంలో ముస్లింలు సంతాపం తెలుపుతారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ బంధువులతో కలిసి అమరుడైన రోజని ముస్లిం పెద్దలు చెబుతారు.
Similar News
News January 28, 2025
గంభీర్‌కు అదే ఆఖరి సిరీస్ కావొచ్చు: ఆకాశ్ చోప్రా
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పించాలన్న డిమాండ్లు వినబడ్డాయి. అయితే, బీసీసీఐ గంభీర్‌కు మరింత సమయం ఇవ్వొచ్చని వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ‘భారత్ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో ఆడే టెస్టు సిరీస్ వరకు గంభీర్‌ను BCCI కొనసాగించొచ్చు. ఒకవేళ ఆ సిరీస్ కూడా కోల్పోతే ఇక భారత కోచ్‌గా ఆయనకు అదే ఆఖరి సిరీస్ అయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.
News January 28, 2025
స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. విద్యా కమిషన్ సూచనలివే!
TG: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది. అన్ని కేటగిరీల వారికి మెస్ ఛార్జీలను రూ.2 పెంచాలని, ఒకే మెస్ ఛార్జీలను అమలు చేయాలని సీఎస్‌కు నివేదిక ఇచ్చింది. వంట సహా తాగేందుకు బోర్ నీళ్లకు బదులు మిషన్ భగీరథ నల్లా నీళ్లు వాడాలని పేర్కొంది. భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్‌పై వండించాలని సూచించింది.
News January 28, 2025
దావోస్‌లో ఒప్పందాలుండవ్.. చర్చలే: మంత్రి లోకేశ్
AP: దావోస్ పర్యటనలో కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఒప్పందమూ చేసుకోకపోవడంపై వస్తున్న విమర్శలకు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. CBN 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారని, అక్కడ ఎప్పుడూ MOUలు జరగవని చెప్పారు. చర్చలు మాత్రమే జరుగుతాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే రాష్ట్రానికి రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. వీటి వల్ల 4.1 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.