News September 2, 2024
ఈ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. వర్షాలు కురిసే మరికొన్ని జిల్లాల్లోనూ రాత్రిలోగా కలెక్టర్లు సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
Similar News
News February 1, 2026
CM కీలక నిర్ణయం: ఫలితాల తర్వాతే ఛైర్మన్లపై ప్రకటన

TG: పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఛైర్మన్, మేయర్ అభ్యర్థులను ప్రకటించాలని నాయకులను ఆదేశించారు. ఎన్నికలకు ముందే పేర్లు ప్రకటిస్తే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని సీఎం హెచ్చరించారు. చాలా మంది నాయకులు ఈ పదవుల కోసం డిమాండ్ చేస్తున్నారు.
News February 1, 2026
బడ్జెట్ ప్రసంగంలో పారదర్శకత లేదు: కాంగ్రెస్

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్థికమంత్రి ప్రసంగంలో పారదర్శకత లేదని, కేటాయింపులపై స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. బడ్జెట్ అంచనాలను అందుకోలేదన్నారు. ఈ బడ్జెట్ కేవలం దేశంలోని 5% మంది కోసమే రూపొందించినట్లు ఉందని సమాజ్‌వాదీ నేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
News February 1, 2026
వీటి ధరలు తగ్గే ఛాన్స్!

ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీకి సంబంధించిన పరికరాలపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో ఈవీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. మైక్రోవేవ్ ఓవెన్ పరికరాలు, సోడియమ్ యాంటీమోనేట్‌పైనా కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీంతో మైక్రోవేవ్ ఓవెన్స్, సోలార్ గ్లాస్ ధరలు తగ్గనున్నాయి. సీఫుడ్ ధరలు తగ్గనున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, ఏవియేషన్‌కు సంబంధించిన ముడిసరకులపైన కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చింది.


