News February 13, 2025

రేపు తెలంగాణ బంద్

image

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Similar News

News January 13, 2026

TCSలో మరిన్ని ఉద్యోగాల కోత!

image

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్‌లో 11,151 మందిని తీసేసింది.

News January 13, 2026

‘రాజాసాబ్’.. హిందీలో 3 రోజుల్లో రూ.15.75 కోట్లే!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’కు హిందీలో దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి 3 రోజుల్లో రూ.15.75 కోట్లు (గ్రాస్) మాత్రమే వసూలు చేసింది. అటు ధురంధర్ మూవీ 38వ రోజు హిందీలో రూ.6.5 కోట్లకు పైగా (నెట్) వసూలు చేయడం విశేషం. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి-2, కల్కి సినిమాలు హిందీలో ఫస్ట్ వీకెండ్ రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి.

News January 13, 2026

ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా

image

TG: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంది కరెంట్ బిల్లులు చెల్లించట్లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘పాతబస్తీలో ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారు. అంటే దాని విలువ ఏడాదికి రూ.500 కోట్లు. ఇది 2023 డేటా. ఇప్పుడు ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని పాత వార్తలను షేర్ చేశారు.