News March 21, 2025

రేపే ఎర్త్ అవర్.. లైట్లు ఆపేద్దామా..?

image

ప్రతి ఏటా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ జరుపుతుంటారు. ఆ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో లైట్లను ఆపేస్తారు. పర్యావరణ పరిరక్షణకు, భూతలతాపాన్ని నియంత్రించేందుకు ఈరోజును ప్రారంభించారు. ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆపి ఈరోజును పాటించాలని AP గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కాగా.. ఢిల్లీ ప్రభుత్వం ఎర్త్ డేను పాటిస్తూ రేపు రాత్రి ఆ గంట సేపు లైట్లను ఆపేయనుంది.

Similar News

News March 22, 2025

ఏకాగ్రత కుదరటం లేదా? ఈ టిప్స్ పాటించండి

image

ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. సుడోకు, క్రాస్‌వర్డ్స్ వంటివి సాలో చేస్తూ ఉండండి. రోజూ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలు భావాలను రాస్తూ ఉండండి. ఏదైనా ఒక విషయాన్ని విజువలైజేషన్ చేయండి. రోజూ వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. మ్యూజిక్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వార మన ఫోకస్ పెంచవచ్చు.

News March 22, 2025

భాష పేరుతో రాజకీయం అందుకే? అమిత్ షా

image

కొన్ని రాజకీయ పార్టీలు తమ అవినీతిని కప్పి పెట్టడానికే భాష పేరుతో రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సౌత్ ఇండియా భాషలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో NDA కూటమి అధికారంలోకి వస్తే మెడిసిన్, ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను తమిళ భాషలోకి అనువదిస్తామని తెలిపారు.

News March 22, 2025

రోహిత్‌లా విరాట్ రిస్క్ తీసుకోలేరు: ఫించ్

image

దూకుడుగా ఆడేందుకు రోహిత్‌కు ఉన్న అవకాశం విరాట్‌కు లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ అభిప్రాయపడ్డారు. టీమ్ పరిస్థితుల్ని బట్టి చూస్తే రోహిత్‌లా రిస్క్ తీసుకోలేరని పేర్కొన్నారు. ‘ముంబైలో రోహిత్‌ తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఆయన స్కోరు ప్రభావం చూపించదు. అందుకే శర్మ స్వేచ్ఛగా ఆడతారు. కానీ ఆర్సీబీ జట్టు విరాట్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన స్కోర్ చేస్తేనే జట్టుకు మంచి పునాది లభిస్తుంది’ అని విశ్లేషించారు.

error: Content is protected !!