News August 3, 2024
రేపు ఫ్రెండ్షిప్ డే.. మీ ప్లాన్స్ ఏంటి మచా?

మచా.. మన రోజు(ఫ్రెండ్షిప్ డే) వచ్చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు తొలి ఆదివారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నాం కదా! మరి ఈసారి నీ ఫ్రెండ్కు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏదైనా అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశావా? ఈ రెండూ కాక ‘హా! ప్రతి ఏడాది వచ్చేదే కదా’ అని లైట్ తీసుకుంటున్నావా? గిఫ్టులు, సర్ప్రైజ్లు కాకపోయినా కనీసం విష్ చేసి ‘నీకు ఓ ఫ్రెండ్ ఉన్నాడ’ని గుర్తు చెయ్. నీ ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయ్.
Similar News
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మేడారం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: CM

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార సంప్రదాయాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పొరపాట్లు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాతి పనులు, రహదారులు, గద్దెల చుట్టూ రాకపోకలకు మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి అంశంపై CM అధికారులకు సూచనలు చేశారు.
News December 1, 2025
సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.


