News November 20, 2024

రేపే లాస్ట్ డేట్

image

తెలంగాణలో టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్ 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు 1.50లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. అయితే దరఖాస్తు గడువును పొడిగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తారు.. టెట్‌కు దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News October 17, 2025

రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.

News October 17, 2025

భారత్ మౌనంగా ఉండదు: మోదీ

image

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్‌లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్‌లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.

News October 17, 2025

తిన్న వెంటనే నడుస్తున్నారా?

image

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it