News April 9, 2024

ఏపీ పాలిసెట్ దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

ఏపీ పాలిసెట్-2024 <>దరఖాస్తు<<>> గడువు రేపటితో ముగియనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం గడువు ఈనెల 5తో ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అలాగే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇప్పటికే స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27న పరీక్ష జరుగుతుందని తెలిపారు.

Similar News

News January 13, 2025

CT-2025: ఆస్ట్రేలియా టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన స్క్వాడ్ ప్రకటించింది. కమిన్స్ సారథిగా ఉంటారని వెల్లడించింది.
టీమ్: కమిన్స్ (C), హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, షార్ట్, స్టాయినిస్, ఇల్లిస్, ఇంగ్లిస్, కారే, హార్డీ, మ్యాక్స్‌వెల్, జంపా, స్టార్క్, హేజిల్‌వుడ్.

News January 13, 2025

గాలిపటాలు ఎగురవేస్తున్నారా?

image

సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.

News January 13, 2025

ఈ పోస్టర్ అదిరిపోయిందిగా..

image

సినీ అభిమానులకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. పైగా తమ ఫేవరేట్ హీరోల చిత్రాలు విడుదలైతే వారు చేసే సందడి మామూలుగా ఉండదు. అలాగే TFI బాగుండాలని కొందరు కోరుకుంటారు. ఈ క్రమంలో APలోని యడ్లపాడులో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. బాలయ్య, చెర్రీ, వెంకీమామ సినిమా పేర్లతో ‘మేం మేం బానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి’ అని సంక్రాంతి విషెస్ తెలిపారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.