News August 8, 2024
రేపే ‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్’ మూవీ లాంచ్

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రాబోయే మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని రేపు అధికారికంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ‘న్యూ బిగినింగ్స్.. హైదరాబాద్ పిలుస్తోంది’ అంటూ ప్రశాంత్ భార్య లికిత ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో లాంచ్పై మరింత ఆత్రుత పెరిగింది. మేకర్సే రేపు ఫొటోలు షేర్ చేస్తారని సమాచారం.
Similar News
News December 31, 2025
పడక గదిలో పదునైన వస్తువులు ఉండకూడదా?

కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను బెడ్ రూమ్లో ఉంచకూడదని వాస్తు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కలహాలు పెరుగుతాయని అంటున్నారు. ‘మానసిక ఒత్తిడిని కలిగించి నిద్రలేమి సమస్యలకు దారితీస్తాయి. వీటిని ఎప్పుడూ బహిరంగంగా ఉంచకూడదు. వంట గదిలోనే ఎవరూ చేయి పెట్టని ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం. పడక గదిలో వీటిని నివారిస్తే.. అశాంతి దూరమవుతుంది’ అంటున్నారు.
News December 31, 2025
హత్యకేసులో టీడీపీ ఎమ్మెల్యేకి నోటీసులు: YCP

AP: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో విచారణ ముమ్మరమైందని YCP పేర్కొంది. ఈ కేసులో TDP MLA బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డిని విచారించి స్టేట్మెంట్ నమోదు చేసినట్లు వెల్లడించింది. రాయుడు హత్య వెనుక రాజకీయ కోణం ఉందని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించింది.
News December 31, 2025
రూ.7తో రూ.కోటి.. 10% పేదలకు ఇస్తానన్న రైతు

పంజాబ్కు చెందిన ఓ రైతును అదృష్టం వరించింది. రూ.7తో లాటరీ టికెట్ కొనగా రూ.కోటి రివార్డు వచ్చింది. ఫతేఘర్కు చెందిన రైతు బల్కర్ సింగ్ గత పదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నారు. డిసెంబర్ 29న లాటరీ గెలిచినట్లు కాల్ రాగానే డాన్సులతో గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. అందరికీ స్వీట్లు పంచారు. వచ్చిన డబ్బుతో తన వ్యవసాయాన్ని ఇంకా పెంచుతానని, 10% పేదలకు పంచుతానని ఆ రైతన్న పేర్కొన్నారు.


