News September 24, 2024
రేపు జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికలు

జమ్మూకశ్మీర్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 26 సీట్లలో పోలింగ్ జరగనుంది. ఇందులో కశ్మీర్లో 15, జమ్మూలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బుద్గాం, గందర్బాల్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 24 స్థానాలకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News October 30, 2025
ఇవి తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిస్తాయి

☛ టమాటలో బాక్టీరియా ఎండుతెగులు, ఆకుముడత వైరస్ తెగులు తట్టుకొనే రకాలు: అర్కా అనన్య, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్ ☛ వంగలో బాక్టీరియా ఎండు తెగులును తట్టుకునేవి: అర్కా ఆనంద్, అర్కా నిధి, అర్కా కేశవ ☛ బెండలో వైరస్ను తట్టుకునేవి: అర్కా అనామికా, అర్కా అభయ్, పర్బానీ కాంతి
☛ మిరపలో వైరస్ తెగుళ్లను అర్కా మేఘన, వైరస్, బూడిద తెగుళ్లను అర్కా హరిత తట్టుకుంటుంది. ☛ వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 30, 2025
బంధాలకు మిడ్లైఫ్ క్రైసిస్ ముప్పు

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.


