News November 19, 2024
రేపే ఝార్ఖండ్ రెండో దశ ఎన్నికలు

ఝార్ఖండ్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 528 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. CM హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన, BJP స్టేట్ చీఫ్ బాబూలాల్, ప్రతిపక్ష నేత అమర్నాథ్, నలుగురు మంత్రులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ 38 స్థానాల్లో JMM 13, BJP 12, కాంగ్రెస్ 8, సీపీఐ ఎంఎల్ ఒక చోట గెలుపొందాయి.
Similar News
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.
News December 3, 2025
జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్‌పై ట్యాక్స్!

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్‌పై అక్కడ వ్యాట్ లేదు.


