News October 31, 2024

రేపు ‘ఉచిత గ్యాస్ సిలిండర్’ ప్రారంభం

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అర్హులకు అందనున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అందజేయనుంది. కాగా ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.

Similar News

News November 26, 2025

సిద్దిపేటలో మహిళలకే 232 స్థానాలు

image

సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో మొత్తం 508 జీపీలు ఉండగా అందులో మహిళలకే 232 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. వీటిలో ఎస్టీ మహిళలకు 8, ఎస్సీలకు 41, బీసీలకు 61, జనరల్- మహిళలకు 122 స్థానాలు రిజర్వు చేశారు. అయితే 42 % ఆశించిన బీసీలకు 26.7 % మాత్రమే దక్కాయి. జిల్లాల మొత్తం ఓటర్లు 6,55,958 మంది ఉండగా అందులో పురుషులు 3,21,766 మహిళలు 3,34,186, ఇతరులు 6 మంది ఉన్నారు.

News November 26, 2025

నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

image

1921: వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జననం
1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది
1997: సినీ నటుడు మందాడి ప్రభాకర రెడ్డి మరణం
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబై ఉగ్ర దాడిలో 160 మందికిపైగా మృతి (ఫొటోలో)
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం

News November 26, 2025

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.