News May 6, 2024

రేపే మూడో విడత పోలింగ్

image

లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది. 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుజరాత్‌లో ఒక స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 25స్థానాలకు, కర్ణాటకలో 14, మహారాష్ట్ర 11, UP 10, MP 8, ప.బెంగాల్ 4, అస్సాం 4, బిహార్ 5, ఛత్తీస్‌గఢ్‌లో 7 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అమిత్ షా, జ్యోతిరాధిత్య, దిగ్విజయ్ సింగ్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

Similar News

News December 29, 2024

RRR సూపర్ గేమ్ ఛేంజర్ కానుంది: కోమటిరెడ్డి

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని వెల్లడించారు. RRR కోసం సీఎంతో కలిసి ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి గడ్కరీకి వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ORRలాగే RRR కూడా సూపర్ గేమ్ ఛేంజర్ కానుందని తెలిపారు. సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఇదని పేర్కొన్నారు.

News December 29, 2024

నాగార్జునసాగర్ భద్రతపై కన్ఫ్యూజన్

image

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం తలెత్తింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రి విధుల్లోకి CRPF సిబ్బంది వచ్చి భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఏం జరుగుతుందనేది తెలియక స్థానిక అధికారులు అయోమయానికి గురయ్యారు.

News December 28, 2024

కలెక్టర్ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా?: తల్లి

image

రాజస్థాన్లో బోరుబావిలో పడిన <<14987957>>చిన్నారి<<>> తల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు అందులో పడి 6 రోజులైంది. ఆకలి, దాహంతో ఎంత వేదన అనుభవిస్తుందో? కలెక్టర్ పిల్లలైతే ఇలాగే వదిలేసేవారా?’ అని ఏడుస్తూ ప్రశ్నించారు. తన కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని వేడుకున్నారు. ఈనెల 23న చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఆమెను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.