News August 26, 2025
రేపే వినాయక చవితి.. మార్కెట్లు రష్

వినాయక చవితికి మరొక్క రోజే మిగిలి ఉండటంతో మార్కెట్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. వినాయక ప్రతిమలు కొనేందుకు ప్రజలతో పాటు మండపాల నిర్వాహకులు విక్రయ షెడ్ల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వ్యాపారులతో బేరమాడి ఐడల్స్ కొంటున్నారు. అటు పూజకు అవసరమైన పత్రీలు, వస్తువులు, పూలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సామగ్రి కొనుగోలుదారులతో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
Similar News
News August 26, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సుమోటోగా స్వీకరించిన NCW

TG: గర్భవతైన భార్య స్వాతిని భర్త ముక్కలుగా నరికి మూసీలో పడేసిన ఘటనను జాతీయ మహిళా కమిషన్(NCW) సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్‌కర్ లేఖ రాశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, పారదర్శకంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటు స్వాతి శరీర భాగాల కోసం SDRF బృందం మూసీలో గాలిస్తోంది.
News August 26, 2025
సాదియా అంకితభావం యువతకు స్ఫూర్తి: లోకేశ్

AP: IPF వరల్డ్ క్లాసిక్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ కాంస్య పతకం సాధించారు. ఆమెకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించారు. దేశంతో పాటు మన మంగళగిరికి గర్వకారణంగా నిలిచారు. ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు.
News August 26, 2025
సెప్టెంబర్ 12న ‘మిరాయ్’ విడుదల

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈనెల 28న సరికొత్త ట్రైలర్‌తో అభిమానులను అలరిస్తామని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఫాంటసీ డ్రామా ఏడు భాషల్లో విడుదల కానుంది.