News July 27, 2024
రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్

TG: లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో HYDలో 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. పాతబస్తీతో పాటు మరి కొన్ని చోట్ల రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News January 30, 2026
గుమ్మడి గింజలతో ఎన్నో లాభాలు

గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, జింక్, భాస్వరం, పొటాషియం వంటి అమైనో ఆమ్లాలు, ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిక్తో పాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలస్ట్రాల్ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ సరిగా జరిగేలా చేసి బీపీని అదుపులో ఉండేలా చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.
News January 30, 2026
IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో పోస్టులు

<
News January 30, 2026
పొడవైన నడక దారి.. మొత్తం 22,387కి.మీలు

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి రష్యాలోని మగదాన్ వరకు ఉన్న మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైన నడక దారి. ఇది 17 దేశాల గుండా సుమారు 22,387 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎక్కడా విమానాలు లేదా పడవలు అవసరం లేదు. కేవలం నడిచి వెళ్లవచ్చు. అయితే యుద్ధాలు, వీసా కష్టాలు, విపరీతమైన చలి వల్ల దీనిని పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. ఇప్పటివరకు ఎవరూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సాహసించలేదు.


