News December 22, 2024
రేపు ఉదయం 10 గం.కు..
AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. రేపు (సోమవారం) పలు దర్శన టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నెల అంగప్రదక్షిణం టోకెన్లు రేపు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనం (జనవరి 10 నుంచి 19) శ్రీవాణి టికెట్లు రేపు ఉ.11 గం.కు రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 23, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.
News December 23, 2024
ఆ ముగ్గురితో సినిమాలు చేయాలనుకున్నా కుదరలేదు: శంకర్
ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ కథాంశంతో గేమ్ ఛేంజర్ రూపొందించినట్లు డైరెక్టర్ శంకర్ చెప్పారు. రామ్ చరణ్ నటన సెటిల్డ్‌గా ఉందని, కాలేజీ లుక్‌లో ఫైర్ ఉంటుందని డల్లాస్ ఈవెంట్‌లో తెలిపారు. తెలుగులో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌తో సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదన్నారు. చెర్రీతో మూవీ చేయాలని రాసిపెట్టి ఉందని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.
News December 23, 2024
నేనింకా బతికే ఉన్నా: కింగ్ చార్లెస్-3
క్యాన్సర్ నుంచి కోలుకున్న బ్రిటన్ రాజు చార్లెస్-3 తాజాగా పలువురు సాధారణ పౌరులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ వర్గాల ప్రముఖులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘రాజు గారు మీరు ఎలా ఉన్నారు?’ అని భారత సంతతికి చెందిన సిక్కు ప్రతినిధి హర్విందర్ అడిగారు. దీనికి చార్లెస్ స్పందిస్తూ తానింకా బతికే ఉన్నానని సరదాగా చెప్పడంతో అందరూ చిరునవ్వు చిందించారు.