News November 16, 2024
రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు రాజురా, డిగ్రాస్, వార్ధాలో, ఎల్లుండి నాందేడ్, నాయగావ్, భోకర్, సోలాపూర్‌లో రోడ్ షోల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
రేపటి నుంచి వారి ఖాతాల్లో నగదు జమ

AP: విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతులకు రేపటి నుంచి పరిహారం అందజేయనున్నట్లు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు నిర్ణయించిన ₹17 లక్షల ధరను ప్రభుత్వం ₹20 లక్షలకు పెంచిందని చెప్పారు. రైతుల భూములకు ఎక్కువ ధర ఇస్తామని తప్పుదోవ పట్టిస్తున్న దళారులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని హెచ్చరించారు.
News November 21, 2025
డైరెక్షన్‌పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని నటుడు అల్లరి నరేశ్ అన్నారు. తాను తెరకెక్కించే సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పారు. తాను నటించిన తొలి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ అని, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు. సమాంతరంగా మూడు నాలుగు కథలు జరుగుతుంటాయని చెప్పారు. ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News November 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


