News February 23, 2025
రేపు భారత్vsపాకిస్థాన్.. ఎక్కడ చూడాలంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ: రేపు భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం కావడంతో కోట్లాది మంది ఈ మ్యాచ్ చూడనున్నారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. జియో హాట్స్టార్ యాప్లోనూ చూడొచ్చు. దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో రేపు మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. Way2newsలో లైవ్ స్కోర్ పొందవచ్చు.
ALL THE BEST TEAM INDIA
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


