News July 14, 2024
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: ప్రభుత్వం

AP: మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 1, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


