News March 23, 2025
పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

KKRతో మ్యాచులో పేసర్ భువనేశ్వర్ కుమార్ను RCB బెంచ్కే పరిమితం చేసింది. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే SRHలో ఉండుంటే డగౌట్లో కూర్చునే పరిస్థితి రాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ దశాబ్దానికిపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
Similar News
News November 15, 2025
మరో కీలక మావో లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.


