News January 3, 2025

పాపం మగాళ్లు! స్త్రీ‘శక్తి’కి బలవుతున్నారు!

image

<<15048434>>బస్సు<<>> ఛార్జీలను 15% పెంచుతున్న కర్ణాటక సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాంగ్రెస్ ఇస్తున్న ‘బయ్ వన్ గెట్ వన్’ ఆఫర్ అంటూ BJP సెటైర్లు వేసింది. అభివృద్ధికి కీడుచేసే ఫ్రీ శక్తి స్కీములు ఎందుకంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘పాపం మగాళ్లు! ఫ్రీ పేరుతో భార్యల టికెట్ డబ్బులూ చెల్లిస్తూ బలవుతున్నారు’ అని నెటిజన్లు అంటున్నారు. ఉచితాలకు ఆశపడితే ఏదోవిధంగా జేబుకు చిల్లు తప్పదని కొందరి ఫీలింగ్.

Similar News

News January 5, 2025

దంపతుల టోకరా.. వ్యాపారవేత్తకు ₹7.63 కోట్ల మోసం

image

అధిక రాబ‌డులకు ఆశ ప‌డి నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ₹7.63 కోట్లు న‌ష్ట‌పోయారు. జ‌యంత్ గులాబ్‌రావ్‌, అత‌ని భార్య కేస‌రి ఓ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెడితే ఏటా 35% లాభాలు వ‌స్తాయ‌ని జితేంద‌ర్ జోషిని న‌మ్మించారు. ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో జోషి భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. తీరా జ‌యంత్ దంప‌తులు మొహం చాటేయ‌డంతో జోషి ₹7.63Cr మోస‌పోయారు. ఆర్థిక నేర విభాగం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తోంది.

News January 5, 2025

గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన కార్ల్‌సన్

image

ప్రపంచ నంబర్-1 చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ గర్ల్‌ఫ్రెండ్‌ ఎల్లా విక్టోరియా మలోన్‌ను పెళ్లి చేసుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో కుటుంబ సభ్యులు, కొద్ది‌మంది బంధువుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకను నెట్‌ఫ్లిక్స్ సినీ బృందం చిత్రీకరించింది. ఇటీవల కార్ల్‌సన్ ఎనిమిదో సారి వరల్డ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలవగా, టైటిల్ షేరింగ్ విషయంపై కాంట్రవర్సీ నడిచిన విషయం తెలిసిందే.

News January 5, 2025

స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ గడువు పెంపు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైటులో దరఖాస్తు చేసేందుకు గతంలో గడువు విధించగా, చాలా మంది అప్లై చేయలేదు. 7.44 లక్షల మంది రెన్యువల్ విద్యార్థుల్లో 4 లక్షల మంది, 4.83 లక్షల మంది కొత్త వారిలో కేవలం 1.39 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.