News April 4, 2025

పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని తాగి..

image

అలోవేరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగి 14 ఏళ్ల బాలిక మరణించింది. బెంగళూరుకు చెందిన దీపాంజలికి అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్‌ తీసుకొని తాగేసింది. అయితే అంతకుముందే అందులో జ్యూస్ అయిపోవడంతో పేరెంట్స్ ఆ డబ్బాలో పురుగుల మందు లిక్విడ్ పోసి పెట్టారు. అది గమనించకపోవడంతో దీపాంజలి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

Similar News

News April 12, 2025

రేపే రిజల్ట్స్.. ఆత్మహత్యలు వద్దు సోదరా!

image

సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువుల ఫలితం రేపు తేలనుంది. ఉ.11 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులకు అంచనాలు ఉండటం సహజం. కానీ ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లను తిట్టకండి. కనిపెంచిన మీరే వాళ్లపై నమ్మకం ఉంచి, ధైర్యం చెప్పకపోతే ఎలా? ప్రతికూల ఫలితాలు వచ్చినా భవిష్యత్తుపై నమ్మకం కలిగించండి. ఫెయిలైనంత మాత్రాన లైఫ్ ముగిసినట్టు కాదని పిల్లలూ గుర్తుంచుకోవాలి.
SHARE IT

News April 12, 2025

ధోనీపై తమిళ హీరో అసహనం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.

News April 12, 2025

PHOTOS: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

AP: ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన చూడొచ్చు.

error: Content is protected !!