News March 8, 2025
పాపం క్లాసెన్.. ఎక్కడ అడుగుపెట్టినా ఓటమే..!

అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికాకు ఎంత దురదృష్టం ఉందో ఆ జట్టు స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌కు అంతకంటే ఎక్కువగా ఉంది. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచులు ఆడినా అతడి జట్టు ఓటమిపాలవుతోంది. 2023 MLC లీగ్ ఫైనల్, 2024 SAT20 ఫైనల్, 2024 IPL ఫైనల్, 2023 ODI WC సెమీస్, 2024 T20 WC ఫైనల్, 2025 CT సెమీస్‌లో ఆయన ప్రాతినిధ్యం వహించిన జట్లన్నీ ఓటమి పాలయ్యాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై జాలి చూపిస్తున్నారు.
Similar News
News October 17, 2025
మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్‌పై కసరత్తు

AP: మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై క్యాబినెట్లో చర్చించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని మైనింగ్‌పై సమీక్షలో CM CBN అధికారులను ఆదేశించారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో వారికి 50% రాయితీ ఇవ్వాలని సూచించారు. తవ్వకాలపై శాటిలైట్ చిత్రాలతో అంచనా వేయాలని చెప్పారు. ఒడిశా మాదిరి వాల్యూ ఎడిషన్ చేస్తే మైనింగ్ ద్వారా ₹30వేల కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు.
News October 17, 2025
14,582 పోస్టులు.. ప్రైమరీ కీ విడుదల

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL)-2025 టైర్-1 పరీక్ష ప్రాథమిక కీని SSC విడుదల చేసింది. అభ్యర్థులు https://ssc.gov.in/ వెబ్సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 19 వరకు కీపై అభ్యంతరాలను తెలపవచ్చు. 14,582 పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు, అక్టోబర్ 14న ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 13.5 లక్షల మంది హాజరయ్యారు.
News October 17, 2025
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దు: బీజేపీ ఎమ్మెల్యే

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దయచేసి హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దు. అక్కడ మీ ట్రైనర్ ఎవరో తెలియదు. మంచిగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి. అర్థం చేసుకోండి. ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసుకోండి’ అని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.