News March 11, 2025
టాప్-20 పొల్యూటెడ్ సిటీస్.. ఇండియాలోనే 13

ప్రపంచంలోని టాప్-20 అత్యంత కాలుష్యమైన నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నట్లు IQAir కంపెనీ వెల్లడించింది. అస్సాంలోని బైర్నిహాట్ ఇందులో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అత్యంత కాలుష్యమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. మరోవైపు 2024 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్టులో భారత్ ఐదో ర్యాంక్ పొందింది. కాగా వాయు కాలుష్యం వల్ల ఆయుర్దాయం 5.2 ఏళ్లు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News March 12, 2025
ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు

ఈ నెల 16న ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు జరగనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా 20 దేశాల గూఢచర్య విభాగాల అధినేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఉక్రెయిన్-రష్యా, గాజా యుద్ధం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం వంటి అంశాలపై వీరు చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్‌లు కూడా ఈ సమావేశానికి రానున్నారు.
News March 12, 2025
ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.
News March 12, 2025
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా నెలాఖరు వరకు సమావేశాలు సాగే అవకాశం ఉంది. ఇందులోనే బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ KCR సభకు హాజరుకానున్నారు.