News March 22, 2024
IPLలో టాప్ కాంట్రవర్సీలు(Part 1)

* 2008: శ్రీశాంత్(PKBS)పై చేయి చేసుకున్న భజ్జీ(MI).
* 2009: డోప్ టెస్ట్‌లో పాక్ బౌలర్ ఆసిఫ్(DC) ఫెయిల్.. బ్యాన్.
* 2010: వేరే జట్టుతో బేరమాడటంతో జడేజా(RR)పై నిషేధం.
* 2011: క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు చేసిన చీర్ లీడర్ గాబ్రియెల్లా పాస్క్వాలోటో(MI)పై వేటు.
* 2012: వాంఖడేలో సెక్యూరిటీతో షారుఖ్(KKR) గొడవ.. ఖాన్‌పై వాంఖడే నిషేధం.
* 2013: ఫిక్సింగ్‌కు పాల్పడ్డ శ్రీశాంత్, చండీలా, చవాన్(RR).
Similar News
News November 20, 2025
HYD: BRS ఆఫీస్ మూత.. ఫాంహౌస్ వద్దే మీ నేత: కాంగ్రెస్

BRS, KCR, KTR టార్గెట్‌గా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జూబ్లీహిల్స్‌లో ఓటమే మీ శాశ్వత పతనానికి నాంది KTR.. GHMCపై మీరు ఆశలు పెట్టుకోవడం అంటే ఎండమావిలో నీళ్లు తాగినట్టే.. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే దూరంకొట్టిన్రు.. మరికొద్దిరోజుల్లోనే మీ పార్టీ ఆఫీస్ మూత.. ఫాంహౌస్ వద్దే మీ నేత’ అని పేర్కొంది. కాగా GHMC ఎన్నికల్లోనూ BRSను చిత్తుగా ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
News November 20, 2025
ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.
News November 20, 2025
తిరుమలలో గంటల శబ్దం వచ్చేది ఇక్కడి నుంచే..

తిరుమల వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ గంటలున్న మండపాన్ని తిరుమామణి అని అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు గంటలు ఉంటాయి. మొదటిది నారాయణ గంట. రెండవది గోవింద గంట. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ మండపాన్ని సామాన్య శకం 1417వ సంవత్సరంలో మాధవదాసు అనే భక్తుడు నిర్మించాడు. స్వామివారి నివేదన వేళ ఆయన్ను స్మరించుకోవడానికి ఈ మండపం ఒక ముఖ్యమైన భాగం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


