News March 22, 2024

IPLలో టాప్ కాంట్రవర్సీలు(Part 2)

image

* 2014: తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పంజాబ్ కోఓనర్‌ వాడియాపై ప్రీతి జింటా ఫిర్యాదు.
* 2015: నిబంధనలు ఉల్లంఘించి స్టేడియంలో ప్రేయసి అనుష్కను కలిసిన కోహ్లీ.
* 2015: CSK, RRపై రెండేళ్ల నిషేధం.
* 2019: బట్లర్(RR)ను మన్కడ్ రూపంలో ఔట్ చేసిన అశ్విన్(PKBS)
* 2022: నోబాల్ వివాదంతో ఆటగాళ్లను వెనక్కి పిలిచిన పంత్(DC).
* 2023: కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ.

Similar News

News January 3, 2025

చైనా తీరుపై భారత్ నిరసన.. ఈ సారి ఏం చేసిందంటే?

image

చైనా కొత్త వివాదానికి తెర‌లేపింది. లద్దాక్‌ సమీపంలో చైనా 2 కొత్త కౌంటీల ఏర్పాటుపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. హోటన్ ప్రిఫెక్చర్‌ రీజన్‌లో ఈ కౌంటీలు ఏర్పాటు చేయగా, అవి లద్దాక్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన‌ట్టు విదేశాంగ‌ శాఖ తెలిపింది. అలాగే బ్ర‌హ్మ‌పుత్ర న‌దిపై చైనా చేపట్టిన జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టుపై భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. దీని వల్ల కింది రాష్ట్రాలు ప్ర‌భావితం కాకూడ‌ద‌ని సూచించింది.

News January 3, 2025

చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్

image

విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించారు. ఓ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 542 రన్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా ఆయన రికార్డులకెక్కారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆయన వరుసగా ఐదు ఇన్నింగ్సుల్లో నాటౌట్‌గా నిలిచారు. J&Kపై 112*, ఛత్తీస్‌గఢ్‌పై 44*, చండీగఢ్‌పై 163*, తమిళనాడుపై 111* UPపై 112* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. గతంలో ఈ రికార్డు జేమ్స్ ఫ్రాంక్లిన్ (527) పేరిట ఉంది.

News January 3, 2025

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.