News July 19, 2024
కుండపోత వర్షాలు.. బయటకు వెళ్లకండి!

తీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కాసేపట్లో తూర్పు TGలోని WGL, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, KMM, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దాదాపు 30 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని, బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్షాలు, HYDలో మోస్తరు వానలు పడే అవకాశముందన్నారు.
Similar News
News November 19, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.
News November 19, 2025
రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.