News January 10, 2025

RRRపై టార్చర్ కేసు.. విజయ్‌పాల్‌కు బెయిల్ నిరాకరణ

image

AP: రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా రెండో అదనపు కోర్టు కొట్టేసింది. విచారణ సందర్భంగా తనను విజయ్‌పాల్ చిత్రహింసలు పెట్టారని RRR ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదుకాగా, నిన్నటితో పోలీస్ కస్టడీ ముగిసింది.

Similar News

News January 10, 2025

కరెంటు ఛార్జీలపై శుభవార్త

image

AP: 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు.

News January 10, 2025

జాగ్రత్త బాసూ.. సంక్రాంతికి ఊరెళ్తున్నావా?

image

సంక్రాంతికి ఊరెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదు. బీరువా తాళాలు, నగదు, నగలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. ఇంటికి తాళం వేసినట్లు కనిపించకుండా కర్టెన్ తొడగాలి. CC కెమెరాలు బిగించుకోవాలి. ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దు. ఇంటి ముందు తెలిసినవారితో చెత్త శుభ్రం చేయించుకోవాలి. కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలి.

News January 10, 2025

విరాట్, రోహిత్‌ను గంభీర్ తప్పించలేరు: మనోజ్ తివారీ

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను భారత జట్టు నుంచి తప్పించే సాహసం కోచ్ గంభీర్ చేయరని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఆఖరి టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా పక్కన కూర్చుని ఉండి ఉంటారని తెలిపారు. ‘గంభీరే రోహిత్‌ను పక్కకు పెట్టారన్న వార్తలు కరెక్ట్ కాదనుకుంటున్నా. అయితే, జట్టు కోసమే చేసినా ఓ కెప్టెన్‌గా రోహిత్ అలా తప్పుకుని ఉండాల్సింది కాదు’ అని పేర్కొన్నారు.