News August 7, 2024
కఠినంగా వ్యవహరిస్తున్న బ్రిటన్

అక్రమ చొరబాట్లను నిరసిస్తూ బ్రిటన్లో చెలరేగిన అల్లర్లను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులు మున్ముందు బాధపడాల్సి ఉంటుందని ప్రధాని స్టార్మర్ హెచ్చరించారు. సమాజంలో విద్వేషాన్ని పెంచుతున్న నిరసనకారులపై ఉగ్రవాద చట్టాల కింద అభియోగాలు నమోదు చేస్తామని హోం శాఖ స్పష్టం చేసింది. బ్రిటన్లో ముస్లింల అక్రమ వలసలపై ఆందోళనలు జరుగుతున్నాయి.
Similar News
News October 25, 2025
పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.
News October 25, 2025
ఏపీ TET-2025 షెడ్యూల్ ఇదే..

ఏపీలో <
News October 25, 2025
నితీశ్ కుమార్ దూరం.. కారణం ఏంటంటే?

భారత యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి గాయమైంది. అడిలైడ్లో రెండో వన్డే ఆడుతున్న సమయంలో ఎడమ తొడ కండరాలకు గాయం కాగా నేటి మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఇవాళ్టి వన్డేకు దూరమయ్యారు. నితీశ్ గాయంపై తమ మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు BCCI వెల్లడించింది. అటు తొలి వన్డేలో చివర్లో సిక్సులతో నితీశ్ విరుచుకుపడ్డారు. బౌలింగ్లో చాలినంత అవకాశం రాలేదు.


