News November 4, 2024

గంభీర్ ముందు కఠిన పరీక్ష

image

గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు ఆటతీరు ఆశించినంతగా లేదు. శ్రీలంక, న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. దీంతో త్వరలో రానున్న టోర్నీలు గౌతీకి అగ్నిపరీక్షలే. జట్టు ఆటను మెరుగుపర్చడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఆయనపై చాలా ఉంది. ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండటంతో ఆయన ఎలాంటి టెక్నిక్స్ అమలు చేస్తారనే ఆసక్తి నెలకొంది

Similar News

News October 16, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో నాలుగు నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 862 పాయింట్ల లాభంతో 83,467, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 25,585 వద్ద ముగిశాయి. Nestle, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్. HDFC లైఫ్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, జియో ఫైనాన్షియల్ టాప్ లూజర్స్.

News October 16, 2025

భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భేటీ

image

TG: ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత భేటీ అయ్యారు. నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న క్యాబినెట్ భేటీకి మంత్రి సురేఖ హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత <<18019826>>ఆరోపించిన<<>> సంగతి తెలిసిందే.

News October 16, 2025

కోహ్లీ ట్వీట్‌పై విమర్శలు.. ఎందుకంటే?

image

ఆస్ట్రేలియాకు వెళ్లిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ‘పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన ఆటగాడు గివప్ ఇవ్వరంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది యాడ్ కోసం చేసిన ట్వీట్ అని తెలియడంతో చాలామంది అసంతృప్తికి లోనయ్యారు. తమ అభిమానంతో ఆడుకోవడం కరెక్టేనా? అని మండిపడ్డారు. ఇది యాడ్ పోస్ట్ అని ముందే తెలుసంటూ మరికొందరు పేర్కొన్నారు.