News August 5, 2025

BRSకు కష్టకాలం!

image

TG: ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న BRSను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ రిపోర్టుపై ఉభయసభల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈ నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News August 5, 2025

ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య

image

తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురంలో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, కొడుకును గదిలో బంధించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పుల కారణంగానే కూతుళ్లను హతమార్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 5, 2025

‘బలవంతపు చదువులు’.. కాస్త ఆలోచించండి

image

అర్థం కాని చదువు చదవలేక, తల్లిదండ్రులకు అడ్డు చెప్పలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది. ఆమె రాసిన <<17297177>>లెటర్<<>> సోషల్ మీడియాలో వైరలవ్వగా ఒత్తిడిలో పిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అలాగే పిల్లలు తమ ఇష్టాలు చెప్పుకొనే స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వాలని చెబుతున్నారు. పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారితో చర్చించాలని సూచిస్తున్నారు.

News August 5, 2025

WTC: మూడో స్థానంలో టీమ్ఇండియా

image

వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో విజయంతో నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్-2లో ఉన్నాయి. బంగ్లాదేశ్, వెస్టిండీస్ 5, 6వ స్థానాల్లో ఉన్నాయి. PAK, దక్షిణాఫ్రికా, NZ ఇంకా ఈ సీజన్‌లో మ్యాచులు ఆడలేదు.