News July 19, 2024

హార్దిక్ పాండ్యకు కష్ట కాలం!

image

టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు కష్టకాలం నడుస్తోంది. ఓవైపు ప్రొఫెషనల్‌గా T20 కెప్టెన్సీ దక్కకపోగా, మరోవైపు వ్యక్తిగత జీవితంలో భార్యతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందు IPLలో MI కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అతడిని రోహిత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ అన్నీ టీ20 WC తర్వాత ప్రశంసలుగా మారాయి. కానీ ఇప్పుడు మళ్లీ బ్యాడ్‌లక్ పలకరించింది.

Similar News

News January 9, 2026

కాశీ సెట్‌లో హైఓల్టేజ్ యాక్షన్‌

image

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను పూర్తి చేసిన మేకర్స్, ప్రస్తుతం హైఓల్టేజ్ యాక్షన్‌పై ఫోకస్ పెట్టారు.

News January 9, 2026

హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

image

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్‌లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.

News January 9, 2026

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం