News October 6, 2024
YCP ప్రభుత్వంలో పర్యాటక శాఖ నిర్వీర్యం: మంత్రి కందుల

AP: వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరంలో MV MAA Shipను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
Similar News
News April 1, 2026
జలవివాదాల్లో జోక్యం చేసుకోలేం: కృష్ణా బోర్డు

తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో జోక్యం చేసుకోలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. నీటి పంపిణీపై ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో విచారణ జరుగుతోందని.. ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. శ్రీశైలం-నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని నిలువరించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ మేరకు స్పందించింది.
News April 1, 2026
లక్నో ఈసారి రాణిస్తుందా?

IPL: సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైన LSG ఈసారి సమష్టి ప్రదర్శనతో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ నేతృత్వంలోని DC మీదా అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News April 1, 2026
కేరళం బీజేపీ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట

కేరళం ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ BJP మ్యానిఫెస్టో ప్రకటించింది. మహిళలు, వితంతువులు, 70ఏళ్లుపైబడిన వృద్ధులకు నెలకు ₹3వేల పెన్షన్ అందిస్తామంది. ప్రతిఇంటికీ నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీరు, ఓనమ్-క్రిస్మస్ పండగల కోసం పేదలకు ఏటా ఫ్రీగా రెండు LPG సిలిండర్లు ఇస్తామంది. మందులు, నిత్యావసర సరుకులపై పేద మహిళలకు ‘భక్ష్య ఆరోగ్య సురక్ష’ కార్డుతో ప్రతీనెల ₹2500 రీఛార్జ్ ఆఫర్ చేసింది.


