News December 12, 2024

ఈనెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు: మంత్రి

image

AP: ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

బ్యాంక్ కోచింగ్‌కు వెళ్లిన భార్య.. భర్త సూసైడ్

image

అగలిలోని ఇందిరమ్మ కాలనీలో మహాలింగ(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల మేరకు.. వెల్డింగ్ కార్మికుడిగా పనిచేసే మహాలింగ భార్య బ్యాంక్ కోచింగ్ కోసం నంద్యాలకు వెళ్లడంతో ఒంటరితనానికి లోనై ఈ ఘటనకు పాల్పడ్డాడు. తమ్ముడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 5, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.

News December 5, 2025

చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

image

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్‌గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.