News May 13, 2024
రికార్డు స్థాయి పోలింగ్ దిశగా..

AP: రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత పోలింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈసారి 80% దాటేలా కనిపిస్తోంది. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో 2009: 75.9%, 2014: 78.4%, 2019లో 79.6% మేర పోలింగ్ నమోదైంది. 2024లో సా.5 గంటలకే 67.99% నమోదవడంతో క్యూలైన్లో ఉన్న వారి ఓటింగ్ పూర్తయ్యేసరికి 80% దాటొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 3, 2026
చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న పవన్‌కు సీఎం స్వాగతం పలికారు. ఆపై ఇరువురూ సమావేశమయ్యారు. టీటీడీ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది. అలాగే తన శాఖలకు సంబంధించిన అంశాలపైనా పవన్ చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు సమాచారం.
News March 3, 2026
‘HANUMAN ప్రాజెక్ట్’ లక్ష్యం ఇదే..

AP: మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను నివారించడమే ‘HANUMAN ప్రాజెక్ట్’ ఉద్దేశమని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషులు, వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్న వన్యప్రాణులను ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం, సరిహద్దు గ్రామాల ప్రజల ఉపాధిని కాపాడడమే ఈ ప్రాజెక్టు కర్తవ్యమన్నారు. సంఘర్షణ జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉపశమన చర్యలను చేపడతామన్నారు.
News March 3, 2026
నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

TG: బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.. అందంగా అలంకరించి ఎంతగా మురిసిపోతుందో మాటల్లో వర్ణించలేని అనుభూతి. పిల్లలకు జ్వరమొస్తేనే తట్టుకోలేని తల్లి వారి ఊపిరినే ఆపడం గుండెలు పిండేసే విషాదం. భువనగిరి(D) గొల్లగూడెంలో 10 నెలల బాబు, పాప(2)ను చంపి తానూ తనువు చాలించిందో తల్లి. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నా పిల్లలను చంపడం కంటతడి పెట్టిస్తోంది.


