News February 28, 2025
TPCC రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే

హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, DCC అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు లబ్ధి పొందుతున్న తీరుపై వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్ రెడ్డి, అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
Similar News
News March 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 1, 2025
జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి.. ట్రంప్ రాకతో అంతా తారుమారు

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు US అండగా నిలిచింది. బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చడంతో రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చింది. కానీ ఇటీవల US ఎలక్షన్స్‌లో బైడెన్ ఓటమితో అంతా తారుమారైంది. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు నిధులను ఆపేశారు. అసలు యుద్ధమంతా జెలెన్‌స్కీ వల్లే వస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే US పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.
News March 1, 2025
ములుగు: ‘ఆయనకు MLC టికెట్ ఇవ్వాలి’

బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి కోరారు. సామాజిక కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి అశోక్ అని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి నిత్యావసర వస్తువులు అందించారని, బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.