News January 28, 2025
బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్

TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L, AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://sbi.bank.in/
News January 9, 2026
జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.
News January 9, 2026
హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు కొట్టివేత

టాలీవుడ్ హీరో నవదీప్‌కు TG హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అధికారులు పలుమార్లు ఆయనను విచారించారు.


