News September 12, 2024
ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ

టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ గౌడ్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కుటుంబ సమేతంగా కలిశారు. ఆయనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డి కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈనెల 15న టీపీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
Similar News
News November 23, 2025
భూపాలపల్లి: రూ.50 కోట్ల ధాన్యం రికవరీలో నిర్లక్ష్యం!

జిల్లా సివిల్ సప్లై శాఖలో రూ. 50 కోట్ల విలువైన ధాన్యాన్ని నేటికీ రికవరీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. 2022-23 రబీ సీజన్లో జిల్లాలోని వివిధ రైస్ మిల్లర్ యజమానులు టెండర్ ద్వారా తీసుకున్న ఈ ధాన్యాన్ని, రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి బియ్యంగా అందించలేదు. ధాన్యం తీసుకున్నది వాస్తవమేనని సివిల్ సప్లై అధికారులు ధ్రువీకరించారు.
News November 23, 2025
28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.


