News January 7, 2025
కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ వార్నింగ్
TG: యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సినవేనని, అయితే పార్టీ కార్యాలయంపై దాడి సరికాదన్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఇలా దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా బీజేపీ సహకరించాలని కోరారు.
Similar News
News January 8, 2025
షేక్ హసీనా వీసా పొడిగించిన కేంద్రం!
బంగ్లా మాజీ PM షేక్ హసీనా వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది. గత ఆగస్టు నుంచి ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు. గడువు పెంపుతో ఆమె మరికొంత కాలం ఇక్కడే ఉండేందుకు వీలవుతుంది. అయితే ఇది రాజకీయ ఆశ్రయం కల్పించినట్టు కాదని తెలుస్తోంది. నిన్న ఆమె పాస్పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దుచేసింది. ఓవైపు ఆమెను తిరిగి పంపించాలని యూనస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.
News January 8, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి!
TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. <
News January 8, 2025
మందుబాబులకు బ్యాడ్ న్యూస్
TG: కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. గత ఐదేళ్లుగా బీర్ల ధరల పెంపునకు TGBCL అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతటి భారీ నష్టాల్లో తాము బీర్లను సరఫరా చేయలేమని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఈ బీర్లు దొరకకపోవడంతో కొన్నేళ్లుగా మందుబాబులు జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేశారు.