News March 16, 2025

TPG: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

image

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్‌లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.

Similar News

News October 14, 2025

ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

image

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజా‌బాబు (9705649492) కి తెలపాలని జీఆర్‌పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2025

భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

image

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్‌ఎస్‌లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్‌ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News October 13, 2025

భీమవరం: నేటి పీజీఆర్ఎస్‌కు 95 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.