News October 12, 2025

TPG: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం జాతీయ రహదారి డివైడర్‌పై ఏలూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడు కోల ముఖం కలిగి టీ-షర్టు, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944796612, 9441834286‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 12, 2025

తణుకు: ఆడుకుందామని వెళ్లి.. కాలువలో పడి గల్లంతు

image

తణుకు మండలం పైడిమర్రు కాలువలో ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. తణుకుకి చెందిన 8వ తరగతి చదువుతున్న బొమ్మనబోయిన జోగేంద్రగా గుర్తించారు. ఆదివారం కావడంతో జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News October 12, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 12, 2025

పైడిపర్రు కాలువలో పదేళ్ల బాలుడు గల్లంతు

image

తణుకు మండలం పైడిపర్రు కాలువలో ఆదివారం మధ్యాహ్నం 10ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సుమారు పదిమంది కాలువలో దిగి ఆడుకుంటూ ఉండగా వీరిలో గుర్తుతెలియని బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు కాలువలోకి దిగి గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.