News February 7, 2025
TPT: ఇటీవలే రిటైర్మెంట్.. అంతలోనే సూసైడ్

తిరుమలలో భార్యాభర్త <<15390232>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసుల నాయుడు(60) కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో పనిచేశారు. ఇటీవలే ఆయన రిటైరయ్యారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఆయన తిరుమలకు వెళ్లి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు.
Similar News
News December 6, 2025
దశలవారిగా జోగులాంబ ఆలయ అభివృద్ధి

ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ సమీక్ష నిర్వహించి, ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొదటి దశలో రూ.138.40 కోట్లు, రెండో దశలో రూ.117.60 కోట్లు, మూడో దశలో రూ.91 కోట్లు ఖర్చు చేస్తారు.
News December 6, 2025
NLG: DCCలకు పరీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను DCC అధ్యక్షులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NLG DCC అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేత, BNG DCC అధ్యక్షుడిగా బీర్ల ఐలయ్య, సూర్యాపేట అధ్యక్షుడిగా గుడిపాటి నరసయ్యను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.
News December 6, 2025
ఖమ్మం: సర్పంచ్ బరిలో ఐపీఎస్ అధికారి తల్లి

ఎర్రుపాలెం మండలంలోని నూతనంగా ఏర్పడిన విద్యానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోట వజ్రమ్మ బరిలోకి దిగారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న కోట కిరణ్ కుమార్ తల్లిగా వజ్రమ్మ ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలోనూ సర్పంచ్గా పనిచేసిన అనుభవం కలిగిన ఆమె, 620 ఓట్లున్న విద్యానగర్లో మరోసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


