News February 7, 2025
TPT: ఇటీవలే రిటైర్మెంట్.. అంతలోనే సూసైడ్

తిరుమలలో భార్యాభర్త <<15390232>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసుల నాయుడు(60) కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో పనిచేశారు. ఇటీవలే ఆయన రిటైరయ్యారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఆయన తిరుమలకు వెళ్లి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు.
Similar News
News March 28, 2025
భూకంపం నుంచి తప్పించుకున్న తెలంగాణ MLA ఫ్యామిలీ

బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, అల్లుడు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భారీ భూకంపం ధాటికి అనేక బిల్డింగులు కుప్పకూలాయి. అయితే ఆ ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వారు తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.
News March 28, 2025
ప్రతి విద్యార్థి వివరాలు పక్కాగా ఉండాలి: మన్యం కలెక్టర్

విద్యా సంస్థలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. బడి ఈడు పిల్లలు విధిగా పాఠశాలల్లో ఉండాలన్నారు. పిల్లలు బడి బయట ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News March 28, 2025
ఆసిఫాబాద్: BSNL టవర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

BSNL నెట్వర్క్ టవర్ల నిర్మాణాల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్, బిఎస్ఎన్ఎల్ నిజామాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లతో కలిసి నెట్వర్క్ టవర్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 9 టవర్లలో 8 టవర్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేనందున ప్రారంభించాలన్నారు.