News January 1, 2025

TPT: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

APSSDC ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ నారావారిపల్లి టీటీడీ కళ్యాణ మండపంలో జరగబోయే మెగా జాబ్ మేళా పోస్టర్‌ను మంగళవారం తిరుపతి జిల్లా వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళా దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, 1200 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GDనెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 22, 2025

చిత్తూరు: రూ.7కోట్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

image

బెంగళూరులో ATMకు తరలిస్తున్న రూ.7.19 కోట్లను దోపిడీ చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదివరకే సస్పెండ్ అయిన పోలీస్ అన్నప్ప నాయక్, చోరీలో కీలకంగా వ్యవహరించిన జేవియర్, గోపి, నెల్సన్, నవీన్‌ను అరెస్టు చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఇన్నోవా కారును వదిలి వ్యాగనార్ కారులో పరారైన జేవియర్‌ను తమిళనాడులో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.

News November 22, 2025

పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

image

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.