News July 22, 2024
TPT: డిప్లమా కోర్సులో దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ యానిమల్ హస్బండరీ (Animal Husbandry Diploma) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. పదో తరగతి పాసైనా అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 22.
Similar News
News July 7, 2025
చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
News July 7, 2025
తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరు మృతి

తిరుపతి కపిలతీర్థం వద్ద సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. భక్తులు, యాచకులపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ యాచకుడు మృతి చెందగా, మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు. సైకో కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 7, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదంట..!

చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 9896 Mtsల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 10514 mtsల యూరియా నిల్వ చేయగా 6032 mtsలను ఇప్పటి వరకు రైతులు తీసుకెళ్లారు. 4200 Mts యూరియా అందుబాటులో ఉంది. గోడౌన్‌లో 1852 Mts, ప్రైవేట్ డీలర్స్ దగ్గర 1300Mts, RSKలలో 738 Mts, కంపెనీ గోడౌన్‌లో 300Mts మేర నిల్వ ఉండటంతో యూరియా కొరత రాదని చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ Way2Newsకు తెలిపారు.