News February 25, 2025
TPT: రూ.2.5 కోట్లతో బ్యాంక్ ఉద్యోగి బెట్టింగ్..?

తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రజలు తాకట్టు పెట్టిన ఐదున్నర కేజీల బంగారు నగలు లూటీ చేయడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ సూర్యతేజ ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం. రోజుకు రూ.5 లక్షల చొప్పున 50 రోజుల్లో రూ.2.5 కోట్లతో ఆన్‌లైన్ క్యాసినో ఆడేసినట్లు తెలుస్తోంది.
Similar News
News October 31, 2025
నిర్మల్: రేపు జిల్లా వ్యాప్తంగా 2కే రన్ కార్యక్రమం

శుక్రవారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులందరూ 2కే రన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 2కే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.
News October 31, 2025
దండేపల్లి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

దండేపల్లి మండలం గూడెం శివారులో ఉన్న గోదావరి నదిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దండేపల్లి ఎస్ఐ తహిసొద్దీన్ తెలిపారు. హాజీపూర్ మండలంలోని కర్ణ మామిడికి చెందిన గోళ్ల రవీందర్ ఆరోగ్యం క్షీణించి మానసిక పరిస్థితి సరిగ్గా లేక జీవితంపై విరక్తితో గురువారం గూడెం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రవీందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News October 31, 2025
సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్‌లోని కేవడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్‌ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.


