News February 7, 2025

TPT: ఇటీవలే రిటైర్మెంట్.. అంతలోనే సూసైడ్

image

తిరుమలలో భార్యాభర్త <<15390232>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసుల నాయుడు(60) కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో పనిచేశారు. ఇటీవలే ఆయన రిటైరయ్యారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఆయన తిరుమలకు వెళ్లి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు.

Similar News

News September 17, 2025

HYD: ఆపరేషన్ పోలోకు తక్షణ కారణం ఏంటంటే?

image

1948 SEP 10న నిజాం UNOలో భారత్‌పై ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ పోలోకు తక్షణ కారణమైంది. భారత్ HYD సంస్థానాన్ని ఆక్రమించబోతోంది, యథాతద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్దార్ పటేల్ కఠిననిర్ణయం తీసుకున్నారు. SEP13న బలగాలు HYD వైపు బయలుదేరాయి. SEP 17న నిజాం లొంగిపోయారు. ఒక దేశం మరొక దేశంపై దండెత్తడం చట్టవిరుద్ధమని, సైనిక ఖర్చును వైద్యశాఖ ఖాతాలో వేశారు. HYD సంస్థానం విలీనం అయింది.

News September 17, 2025

MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

image

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News September 17, 2025

విశాఖలో హెల్త్ క్యాంప్‌ను సందర్శించిన సీఎం

image

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్‌<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్‌లో టెస్ట్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.