News May 15, 2024
TPT: పోలీసుల పని తీరుపై విమర్శలు
తిరుపతి పద్మావతి వర్శిటీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘర్షణలను అదుపు చేయటంలో పోలీసులు సకాలంలో స్పందించలేదని విమర్శలున్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తిష్ఠవేసిన స్ట్రాంగ్ రూముకు కిమీ దూరంలో మధ్యాహ్నం 4.30 గంటలకు ఘర్షణ ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటల వరకు అదే పరిస్థితి కొనసాగింది. అదనపు బలగాలు వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Similar News
News December 24, 2024
చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నేడు ఆప్షనల్ సెలవు
చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఇవాళ ఆప్షనల్ సెలవును ప్రకటిస్తున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. తప్పనిసరిగా అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాలని ఆమె ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఈ నిబంధన వర్తించదు.
News December 24, 2024
తిరుపతిలో వ్యభిచారం.. ఒకరి అరెస్ట్
తిరుపతి నగరంలో మరోసారి వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని సత్యనారాయణపురంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఇద్దరు అమ్మాయిలతో కుమారి అనే మహిళ ఈ తంతు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కుమారిని అరెస్ట్ చేశారు. ఇద్దరు అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద కేసు నమోదు చేసినట్లు అలిపిరి పోలీసులు వెల్లడించారు.
News December 24, 2024
కరుణ, త్యాగానికి ప్రతి క్రిస్మస్: తిరుపతి కలెక్టర్
కరుణ, ప్రేమ మార్గం జీసస్ మార్గం అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, చర్చి పాస్టర్లు, పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.