News October 18, 2025
TPT: మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశం

నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హర్ నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (NIDHI) పథకం ద్వారా పద్మావతి మహిళా యూనివర్సిటీ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు చివరి తేదీ నవంబర్ 15.
Similar News
News October 18, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⤇ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులందరిదీ ఒకటే జెండా, అజెండా.. అధికారం లేదన్న అసహనంతోనే క్యాబినెట్‌పై బీఆర్ఎస్ ఆరోపణలు: మంత్రి శ్రీధర్ బాబు
⤇ కరీంనగర్(D) గంగాధర, జగిత్యాల(D) ధర్మపురిలో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
⤇ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGPICS)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ
News October 18, 2025
ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా కల్చర్ సాగు చేసేవారు కచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధి చేయుటకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపారు. లైసెన్సుల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 18, 2025
ఊరిస్తున్న రికార్డులు.. కోహ్లీ అందుకుంటాడా?

విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత AUS సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
*మరో 54 runs: ODIల్లో అత్యధిక రన్స్ లిస్టులో సెకండ్ ప్లేస్.
*68 runs: లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ల (ODI, T20)లో ఫస్ట్ ప్లేస్‌కు. సచిన్ (18,436) తొలి స్థానంలో ఉన్నారు.
*సెంచరీ: ఓ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు(సచిన్-51), ఆసియా వెలుపల ఎక్కువ సెంచరీలు చేసిన Asian బ్యాటర్‌గా (సచిన్-29) రికార్డు