News March 4, 2025

Trade War: అమెరికాపై చైనా ప్రతీకార సుంకాలు

image

ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్‌వార్ ముదురుతోంది. కెనడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్‌పై మార్చి 10 నుంచి 10% సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. చికెన్, గోధుమలు, పత్తి సహా మరికొన్ని వస్తువులపై అదనంగా 10-15% సుంకాలు విధిస్తామని వెల్లడించింది.

Similar News

News November 15, 2025

పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.

News November 15, 2025

రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రైల్<<>> వీల్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ కోటాలో 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, చెస్‌లో పతకాలు సాధించినవారు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in/

News November 15, 2025

మూవీ ముచ్చట్లు

image

* Globetrotter ఈవెంట్‌లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె